ఊట్ పల్లి లో వాలీబాల్ టోర్నమెంట్

viswatelangana.com
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ఊట్పల్లి గ్రామంలో గణతంత్ర దినోత్సవ సందర్భంగా మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల క్రీడా మైదానంలో వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వాలీబాల్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది. వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ గతంలో ఎన్నో జిల్లాస్థాయి రాష్ట్రస్థాయి పోటీలకు ఊటుపల్లి వాలీబాల్ క్రీడాకారులు సత్తా చాటారని క్రీడాకారులను ప్రోత్సహిస్తే భవిష్యత్తులో రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తీసుకొస్తారని అన్నారు. వాలీబాల్ అసోసియేషన్ సభ్యులు టోర్నమెంట్ కు ఆర్థిక సహాయం చేసిన దాతలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ స్వామి,ఉప సర్పంచ్ గణేష్ మహేందర్ ఆకుల నరసయ్య,పొలాస దేవయ్య, అడ్డగట్టు భూమయ్య , ఏజీబీ మహేందర్,, రాచర్ల రవి,ఆకుల చిన్న నరసయ్య,భాస నరేందర్, చెన్నవేణి శ్రీనివాస్,అశోక్,దయ్య అనిల్, బొలిశెట్టి వెంకటేష్,మారుపాక నరసయ్య,రాపల్లి మధు, చెన్నవేని రాజు,బల్కం మహేష్, లైశెట్టి మహేష్ మరియు సీనియర్ వాలీబాల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు.



