ఎమ్మెల్యే ప్లెక్ష్సి చింపిన దుండగులను కఠినంగా శిక్షించాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని కొమురం భీమ్ చౌరస్తాలో మహేందర్ బాబు ఏర్పాటు చేసిన ప్లెక్సీని గుర్తుతెలియని దుండగులు చింపడం అనాగరిక చర్య అని పేర్కొకుంటు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అబిమానులు పొలిస్ స్టేషన్ లో సబ్ ఇన్స్ పెక్టర్ సుధీర్ రావు కు పిర్యాదు చేశారు. అనంతరం ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఈ సందర్భంగా కొండపల్లి రవిందర్ రావు మాట్లాడుతు ప్రభుత్వం తో కలిసి ఎమ్మెల్యే సంజయ్ అక్కసుతో బ్యానర్ చింపిన దుండగులను గుర్తించి కఠినంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. అనంతరం మోర హన్మండ్లు మాట్లాడుతు అభిమాన నాయకుల ఫొటోలతో ప్లెక్ష్సి లను ఏర్పాటు చేసే ఆనవాయితీ ఉంది. మొన్న శనివారం రాత్రి 11 గంటల తర్వాత ఎవ్వరో దుండగులు ప్లెక్ష్సిలను చింపి వేశారు, ఎవ్వరైతే ప్లెక్ష్సి లను తొలగించారో వారిని గుర్తించి చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ప్రశాంతంగా ఉన్న రాయికల్ మండలం ఇలాంటి ఘటనలు ఎప్పుడు జరగలేవు అని ఎంతో ఆనందంగ ఆహ్లాదంగా ప్రేమ పూర్వకంగా ఉండే పరిస్థితులు కొనసాగాలంటే ఇలాంటివి పునరావృతం కాకుండ అందరూ జాగ్రత్త పడాలని తెలిజేస్తూ పోలీసులు చర్యలు తిసుకుంటే ఇలాంటి ఘటనలు జరగవు అని అన్నారు. అనంతరం కోల శ్రీనివాస్ మాట్లాడుతు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అనేక అభివృద్ధి పనులను చేస్తుంటే ఓర్వలేక ప్లెక్ష్సిని చించడం సరికాదని అన్నారు. ఎమ్మెల్యే ప్లెక్ష్సి లను చింపితే రాజకీయంగా ఎదుగలేరని ప్రజలకు, మంచి చేస్తే నే నాయకులుగా గుర్తింపు వస్తుందని దుండగులపై తగు చర్యలు తీసుకోవాలని అన్నారు. ఈ కార్యక్రమంలో మహేందర్ బాబు, గన్నే రాజారెడ్డి, రవిందర్ రెడ్డి, నర్సయ్య , జక్కుల చంద్రశేఖర్, బెజ్జంకి మోహన్, శ్రీనివాస్ గౌడ్, సాయిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.



