కథలాపూర్
ఐదు చేతుల పోచమ్మ విగ్రహ ప్రతిష్ట

viswatelangana.com
May 5th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలాపూర్ మండలంలోని దూలూర్ గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో ఐదు చేతుల పోచమ్మ తల్లి విగ్రహం ప్రతిష్ట చేయడం జరిగింది.గ్రామ ప్రజలు భక్తి శ్రద్దలతో అమ్మ వారికి భోనాలు సమర్పించి ప్రజలందరినీ చల్లగా చూడాలని, వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని అమ్మవారికి పూజలు చేశారు. ఈ సందర్భంగా పోత రాజుల విన్యాసాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పోతరాజు పురుషోత్తం, గ్రామా అభివృద్ధి కమిటీ సభ్యులు గంగారెడ్డి, జయంధర్, శ్రీను, నర్సయ్య, కుంభం మహేష్ భూమయ్య, రాజం, వెంకటేష్ రాజరెడ్డి, తదితరులు పాల్గొన్నారు



