కథలాపూర్
కథలాపూర్ మండల్ వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి ఎవరిని వరించునో?

viswatelangana.com
March 4th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల్ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి పలువురు నాయకులు ఎమ్మెల్యేను కలిసి తమకే చైర్మన్ పదవి వచ్చేలా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు తగ్గేదే లే అంటూ పావులు కదుపు తున్నారు. అంతేకాకుండా ఇక ముందు మళ్లీ జనరల్ కోట వస్తుందో రాదో అనే ఆందోళనలో కూడా ఉన్నారు. మేము కూడా తక్కువేం కాదు అంటూ బీసీ, యస్ సి, సామాజిక వర్గం కూడా తమ ప్రయత్నాలు ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి కోసం కొంతమంది కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు వినికిడి. మరి కొంతమంది మేము కాంగ్రెస్ పార్టీకి కష్టకాలలో చాలా సేవ చేశామని, ఎన్నో పోరాటాలు చేశామని కాబట్టి అధిష్టానం మా పట్ల కాస్త దృష్టి పెట్టాలని వాపోతున్నారు. ఏది ఏమైనా వ్యవసాయ మార్కెట్ కమిటీ పీఠం ఎవరికి దక్కుతుందోనని ప్రజలు చెవులు కొరుక్కుంటున్నారు.



