కథలాపూర్
కథలాపూర్ లో గుట్టుగా క్రిప్టో దందా

viswatelangana.com
October 20th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
గుట్టుగా జగిత్యాల జిల్లా వ్యాప్తంగా క్రిప్టో దందా నడుస్తోంది. ఇది క్రమంగా కథలాపూర్ మండలంలో కూడా విస్తరించింది. చట్ట బద్ధత లేని యాప్ లలో లక్షల్లో పెట్టుబడులు పెట్టి మరికొందరితో పెట్టుబడులు పెట్టిస్తూ లాభం పొందినవాళ్ళుంటే అంతకు 100 రెట్లు మోసపోయినవాళ్ళున్నారు. విదేశీ టూర్లు, ఐఫోన్ గిఫ్ట్ లు నమ్మించడానికే అన్నది జగమెరుగిన సత్యం. జగిత్యాల జిల్లా వ్యాప్తంగా 1000 కోట్లు క్రిప్టో లో పెట్టుబడి పెట్టినట్లు ఇది అన్ని మండలాలకు పాకి కథలాపూర్ మండలంలో 1 కోటి రూపాయలు పెట్టినట్లుగా తెలుస్తుంది. ఆర్ బి ఐ సైతం ఇటువంటి ఆర్థిక లావాదేవీలకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదని నిపుణులు చెప్తున్నారు.



