కోరుట్ల
కోరుట్ల నూతన మున్సిపల్ కమిషనర్ మారుతి ప్రసాద్ ను మర్యాద పూర్వకంగా కలిసిన యూత్ కాంగ్రెస్ నాయకులు

viswatelangana.com
March 29th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ నూతన మున్సిపల్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించిన మారుతి ప్రసాద్ ను శనివారం రోజున యూత్ కాంగ్రెస్ నాయకులు మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం ఇచ్చి శాలువాతో సత్కరించారు.. ఈ కార్యక్రమంలో కోరుట్ల మండల, పట్టణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు ఇంద్రాల హరీష్,కోరుట్ల నియోజక వర్గ ప్రధాన కార్యదర్శి కడకుంట్ల గంగాధర్,కోరుట్ల పట్టణ యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు చిట్యాల సందీప్, కోరుట్ల పట్టణ యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కడకుట్ల నాగరాజ్ లు పాల్గొన్నారు.



