కథలాపూర్

క్రిమి సంహారక మందు త్రాగి వ్యక్తి మృతి

viswatelangana.com

April 17th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
  • కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్న ఎస్సై నవీన్ కుమార్

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావు పేట కు చెందిన రాచమల్ల యోగేష్ వయస్సు 28 సం.లు అనే యువకుడు తేదీ.12/04/2024 రోజున సిరికొండ గ్రామ శివారులో ఏదో క్రిమిసంహారక మందు తాగి అపస్మారక స్థితిలోకి వెళ్ళగా కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఆసుపత్రి కి తరలించి చికిత్స అందిస్తుండగా బుధవారం అనగా తేది 17.04.2024 న ఉదయం మరణించినాడు. మృతుడి తల్లి రాచమల్ల లక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు కథలాపూర్ ఎస్సై నవీన్ కుమార్ తెలిపారు.

Related Articles

Back to top button