కోరుట్ల
గాంధీ విగ్రహానికి పూల మాల వేసిన మున్సిపల్ వైస్ చెర్మన్ పవన్

viswatelangana.com
October 2nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణంలో మున్సిపల్ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్బంగా గాంధీ చౌక్ వద్ద గాంధీ విగ్రహానికి మున్సిపల్ వైస్ చైర్మన్ గడ్డమీది పవన్ అలాగే వార్డ్ కౌన్సిలర్లు పూల మాల వేసి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ గడ్డమీది పవన్, వార్డ్ కౌన్సిలర్లు, మనేజర్ సి హెచ్ శ్రీనివాస్, మునిసిపల్ ఇంజనీర్. టి.అరుణ్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, పుర ప్రముఖులు అలాగే ప్రజలు ఇట్టి కార్యక్రమములో పాల్గొన్నారు.



