రాయికల్
గుడి అభివృద్ధికి ఆర్ధిక సహాయం

viswatelangana.com
May 13th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం భూపతిపూర్ లో గల శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయానికి మెటుపెల్లి కి చెందిన బర్ల గౌతమ్ కుమార్ డాక్టర్ మౌనిక యం.డి దంపతులు యాబై వేల ఆర్థిక సహాయాన్ని ఆలయ అభివృద్ధికి విరాళంగా అందజేశారు. ఈ సందర్బంగా ఆలయ అర్చకులు కాకుస్తం వెంకట కృష్ణ వారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మెన్ సంకోజి మహేష్, ఆలయ అర్చకులు కాకుస్తం వెంకట కృష్ణ, వెంకట రమణ మరియు జోగ రమేష్, జక్కుల రాజేంద్రప్రసాద్ లు పాల్గొన్నారు.



