కథలాపూర్
ఘనంగా పోషణ మాసం

viswatelangana.com
September 27th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో ఐ సి డి ఎస్ ఆధ్వర్యంలో మండల స్థాయి పోషక ఆహార మేళా కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తహసిల్దార్ వినోద్, ఎంపీడీవో శంకర్ లు మాట్లాడుతూ ఎక్కువ పోషక విలువలు కలిగిన చిరుధాన్యాలు ఆకుకూరలు పండ్లు గర్భవతులు బాలింతలు పిల్లలు తప్పనిసరిగా తీసుకోవాలని దీని వల్ల అనేక వ్యాధుల నుండి రక్షణ కలుగుతున్నాయని అన్నారు. అంగన్వాడీ టీచర్లు తయారుచేసిన పోషక ఆహారం ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో వైద్య అధికారి సింధుజ, ఎంపీ ఓ రాజశేఖర్, ఏ పి ఎం నరహరి, ఐ సి డి ఎస్ సూపర్వైజర్ హైమది బేగం అంగన్వాడి టీచర్లు తదితరులు పాల్గొన్నారు.



