కోరుట్ల
ఘనంగా వసంత పంచమి వేడుకలు

viswatelangana.com
February 3rd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల మండలం సంగెం గ్రామంలోని సంఘ మహేశ్వర స్వామి ఆలయ ఆవరణలోని సరస్వతి మాత ఆలయంలో వసంత పంచమి సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించి పిల్లలకు విద్యాభ్యాసం చేయించారు. అనంతరం పాక్స్ డైరెక్టర్ కొమ్ముల మోహన్ రెడ్డి విద్యార్థులకు నోట్సులు, పెన్నులు, పెన్సిళ్లు, పలకలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు చీటి వెంకట్రావు, సుధా వేణి భూమయ్య, ముంజ రాజం, దోనె రాజు, రవీందర్, అలాగే గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.



