రాయికల్
జరిమానా విధించిన మున్సిపల్ కమిషనర్

viswatelangana.com
November 10th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని చికెన్ సెంటర్లలో మున్సిపల్ కమీషనర్ ఏ. జగదీశ్వర్ గౌడ్ ఆధ్వర్యంలో తనిఖీలు నిర్వహించి, పరిశుభ్రత పాటించని, నిల్వ ఉంచిన చికెన్ అమ్ముతున్న పలు చికెన్ సెంటర్లకు జరిమానా విధించడం జరిగింది. మరియు అన్ని చికెన్ సెంటర్ల యజమానులకు పరిశుభ్రత పాటించాలని, ఎలాంటి నిల్వ ఉంచిన చికెన్ అమ్మరాదని, ప్రజారోగ్యం పట్ల బాధ్యత వహించాలని తెలుపుతూ నిబంధనలు ఉల్లంఘించిన వారి పట్ల కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



