రాయికల్
జిల్లా ప్రధాన కార్యదర్శిగా భూమయ్య

viswatelangana.com
April 5th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం అల్లీపూర్ గ్రామానికి చెందిన చిట్యాల భూమయ్య జగిత్యాల రూరల్ మండలం రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా విధులు నిర్వహిస్తున్నారు. తెలంగాణ రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏర్పాటు చేశారు. తెలంగాణ రెవెన్యూ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఎంపికైన చిట్యాల భూమయ్యను జేఏసీ చైర్మన్ వి లచ్చిరెడ్డి అభినందించారు. ఈ సందర్భంగా మేధావులు, విద్యావేత్తలు, రాజకీయ నాయకులు, అల్లీపూర్ గ్రామస్తులు రెవెన్యూ ఇన్స్పెక్టర్ చిట్యాల భూమయ్యకు శుభాకాంక్షలు తెలిపారు.



