డ్రైనేజి సరిగ్గా లేక రోడ్డు అంత కంపు కంపు

viswatelangana.com
కోరుట్ల పట్టణంలోని ఎన్ హెచ్ 63 తిలక్ రోడ్డును అనుకొని ఒక్క డ్రైనేజ్ నిర్మాణాన్ని మధ్యలో వదిలేశారు. చుట్టు ప్రక్కల ప్రాంతాలకు, అక్కడి దుకాణా సముదాయాలకు తీవ్ర అడ్డంకిగా మారింది, ఆడ్రైనేజి నుండి చాలా దుర్వాసన, దోమలు, డ్రైనేజి లో చెత్తతో అక్కడి వ్యాపారస్తులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. ఆ డ్రైనేజి పనులు గత 5 సంవత్సరాల క్రితం రోడ్డుకి ఇరువైపులా డ్రెయినేజీ నిర్మాణాలు జరిగినప్పుడు ఈ డ్రైనేజి నిర్మించాల్సి ఉండే కానీ తర్వాత నిర్మిస్తాం అని చెప్పి వదిలేసారు. అప్పటి నుండి 5 సంవత్సరాలుగా పెండింగ్ లో ఉంది ప్రస్తుతం మున్సిపల్ అధికారులు మాత్రం హౌస్ టాక్స్ లు కట్టలని ప్రజలను ఇబ్బంది పెడుతున్నారు. లేదంటే దుకాణాలకు తాళాలు వేసి సీజ్ చేస్తాం అంటున్నారు. కానీ మున్సిపల్ అధికారులు చేసే పనులు, అభివృధి కి ప్రజలు నోచుకోవడం లేదాని, తిలక్ రోడ్ ప్రజలు ఆరోపిస్తున్నారు.



