కొడిమ్యాల
తాడి చెట్టు పైనుండి పడి గీతా కార్మికునికి తీవ్ర గాయాలు

viswatelangana.com
June 13th, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండలంలో పూడూరు గ్రామంలో గురువారం తాడిచెట్టు పై నుండి పడి తిరుపతికి గౌడ్ అనే గీతా కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. మధ్యాహ్నం సమయంలో వర్షం పడడంతో తాడిచెట్టు మీద ఉన్న కల్లుగీత కార్మికుడు కిందికి దిగే క్రమంలో మోకు జారిపోయింది. దానితో తిరుపతికి, తీవ్ర గాయాలయ్యాలు కావడంతో వెంటనే స్థానికులు జగిత్యాల ఆస్పత్రికి తరలించి ట్రీట్మెంట్ అందిస్తున్నారు పూర్తి వివరాలు తెలియాల్సి ఉందని స్థానికులు తెలిపారు



