కోరుట్లమేడిపల్లి

నిలకడగా ఉన్న గురుకుల విద్యార్థి ఆరోగ్య పరిస్థితి

viswatelangana.com

March 27th, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

మెట్ పల్లి మండలంలోని పెద్దాపూర్ గురుకుల పాఠశాలలో అస్వస్థతకు గురైన ఎనిమిదోవ తరగతి విద్యార్ధి రాపర్తి హర్ష గురువారం ఉదయం 10:30 ప్రాంతంలో అస్వస్థతకు గురికగా, కళాశాల ప్రిన్సిపాల్ ఆందోళనగా ఉన్న విద్యార్థిని చూసి ఆర్డిఓకి సమాచారం అందించి కోరుట్లలోని ప్రైవేట్ హాస్పత్రి లో చేర్పించారు. విద్యార్ధిని చూసి పరీక్షించిన డాక్టర్, ఏదో చీమలు కరిస్తే వచ్చిన స్క్రాటెస్ లాగా ఉన్నాయనీ అడ్మిట్ చేసుకొని చికిత్స అందించారు. విద్యార్థి ఆరోగ్యం నిలకడగా ఉండడం వలన ఇంటికి పంపించారు. ఈ విషయం తెలిసిన వెంటనే జిల్లా వైద్యాధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ హాస్పిటల్ లో అడ్మిట్ అయిన విద్యార్ధిని పరామర్శించారు. అనంతరం జిల్లా వైద్యాధికారి ఐలాపూర్ వైద్యాధికారికి పెద్దాపూర్ గురుకులంలో వైద్య శిబిరం ఏర్పాటు చేయాలని ఆదేశించారు. జిల్లా వైద్యాధికారి ఆదేశాల మేరకు డాక్టర్ సమీనా పెద్దాపూర్ గురుకులంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. విద్యార్థులకు అవగాహన కల్పించడం జరిగింది. రాపర్తి హర్ష అనే విద్యార్ధి యొక్క ఆరోగ్యం నిలకడగా ఉందనీ తెలిపారు. గురుకులంలో వైద్యాధికారి 56 మందిని స్కిన్ ఎలర్జీలు మరియు కడుపునొప్పితో బాధపడుతున్న విద్యార్థులకు చికిత్స అందించారు. గురుకుల పాఠశాల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని ప్రిన్సిపాల్ కు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ ఏ శ్రీనివాస్, వైజాగ్ డాక్టర్ సమీనా వైద్య సిబ్బంది, మిగతా వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button