కోరుట్ల

పబ్లిక్ టాయిలెట్స్ శుభ్రపరిచిన ఆటో డ్రైవర్స్

viswatelangana.com

September 23rd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

కోరుట్ల పట్టణ మున్సిపల్ కమీషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు స్వచ్చత హి సేవ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆటో యూనియన్ సంఘంలోని 50 మంది సభ్యులు టాయిలెట్ పరిసర ప్రాంతలను శుభ్రం చేసారు. ఈ క్యాంపియన్ లో భాగంగా కోరుట్ల పట్టణంలోని ప్రజలు అలాగే పరిసర ప్రాంతాల నుంచి కోరుట్ల పట్టణానికి వచ్చే ప్రజలు పట్టణంలోని పబ్లిక్ టాయిలెట్లను ఉపయోగించుకుని, కోరుట్ల పట్టణాన్ని బహిరంగ మలమూత్ర విసర్జన లేని పట్టణంగా మార్చడం కొరకు సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి, ఇంచార్జ్ సానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్ గొనేల మహేష్, ఆటో యూనియన్ సంఘ సభ్యులు అలాగే మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button