కథలాపూర్
పలు జాతర మహోత్సవంల్లో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే అది శ్రీనివాస్

viswatelangana.com
April 9th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
కథలపూర్ మండలం పెగ్గెర్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ స్వామి వారి జాతర మహోత్సవంలో, తుర్తి గ్రామంలో శ్రీ హనుమాన్ విగ్రహ ప్రతిష్టపన అన్నదాన కార్యక్రమంలో ప్రభుత్వ విప్, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారు మాట్లాడుతూ. ప్రజలందరికీ శ్రీ క్రోధి నామ నూతన సంవత్సరం ఉగాది పర్వదిన శుభాకాంక్షలు తెలియజేశారు.. నూతన సంవత్సరంలో ప్రజలంతా ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని వేడుకున్నారు.. అనంతరం గ్రామస్తులు, ఆలయ కమిటీ సభ్యులు ఎమ్మెల్యే ని ఘనంగా సన్మానించారు.



