మేడిపల్లి

పెద్దమ్మ, మైసమ్మలకు బోనాలు తీసిన కల్వకోట గ్రామ ప్రజలు

viswatelangana.com

June 14th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా మేడిపల్లి మండలంలోని కల్వకోట గ్రామంలో శుక్రవారం రోజున భారీ వర్షం కురిసింది. ఈ భారీ వర్షము లెక్కచేయకుండా కల్వకోట గ్రామ ప్రజలు గ్రామ చివరన ఉన్న పెద్దమ్మ, మైసమ్మలకు డప్పు సప్పులతో, భక్తి శ్రద్ధతో, నెత్తి మీద బోనం ఎత్తుకొని మహిళలు, గ్రామ ప్రజలు పెద్దమ్మ, మైసమ్మలకు బోనాలు తీశారు. ఈ కార్యక్రమంలో గ్రామ ఎంపీటీసీ అదే రాజన్న, మాజీ సర్పంచ్ ఆది లక్ష్మిరాజ్యం, గుగ్గిల రమేష్, భగవంతురావు, పునుగోటి ప్రణీత్ రావు, చిరుత ప్రశాంత్, మహిళలు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు

Related Articles

Back to top button