కథలాపూర్
పోచమ్మ సీసీ రోడ్డు భూమి పూజ పనులు ప్రారంభం

viswatelangana.com
January 31st, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
రాష్ట్ర ప్రభుత్వ విప్ వేములవాడ శాసన సభ్యులు ఆది శ్రీనివాస్ సహకారం తో జిల్లా కథలాపూర్ మండలం ఊట్ పల్లి గ్రామంలో పోచమ్మ సీసీ రోడ్డు కోసం ఈజిఎస్ ఫండ్స్ నుండి అంచనా విలువ 4 లక్షలు శాంక్షన్ ఇవ్వడం జరిగింది. శుక్రవారం భూమి పూజ చేసి పనులు ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమం లో కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు ముదాం శేఖర్, పాల నవీన్, బలగం మహేష్, బర్ల మల్లేశం, గంగారెడ్డి, నర్సయ్య, రాజేశం, వినయ్, గంగారాం, దేవయ్య, మల్లయ్య, మల్లేశం, ప్రభాకర్, మల్లేష్, పొలాస గంగానర్సయ్య, నర్సయ్య, గజెల్లి నరేష్, రాజు, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.



