కథలాపూర్
పోసానిపేట ప్రభుత్వ పాఠశాలలో వార్షిక దినోత్సవ వేడుకలు

viswatelangana.com
April 22nd, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం పోసానిపేట గ్రామంలో ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్య క్రమంలో చిన్నారులు సాంస్కృతిక డ్యాన్స్ ప్రదర్శనలతో అలరించారు. పాఠశాల ప్రధానోపాధ్యా యులు గుండేటి రవి మాట్లాడుతూ.. ఈ స్కూల్ 71ఏళ్లు పూర్తి చేసుకుని 72 అడుగు పెడుతున్నందుకు సంతోషంగా ఉందన్నారు. చిన్నారులు భవిష్యత్తులో వివిధ రంగాల్లో రాణించాలన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా డాక్టర్ ఎం అర్జున్ పీజీహెచ్ఎంలు ఆనందరావు రాజేంద్రప్రసాద్ రాజయ్య మరియు పాఠశాల ప్రధానోపాధ్యాయులు గుండేటి రవికుమార్ మరియు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు గ్రామ ప్రజలు పాల్గొన్నారు మాజీ సర్పంచ్ ఎం జి రెడ్డి నరేష్ ఆకుల రాజేందర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు



