రాయికల్
ప్రతి నెల పింఛన్ ఇవ్వాలి

viswatelangana.com
May 9th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండల పోలీస్ స్టేషన్ లో గత 34 సంవత్సరాలుగా నిర్వీరమంగా విధులు నిర్వర్తించి వృత్తి నే తన ఇంటి పేరుగా మార్చుకున్న హోంగార్డు రామచంద్రం ఇటీవల పదవి విరమణ చేసిన సందర్భంగా ఇటిక్యాల గ్రామంలో బీసీ సంఘాల ఆధ్వర్యంలో శాలువాల తో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా బీసీ నాయకులు మాట్లాడుతూ హోంగార్డు రామచంద్రం పదవి విరమణ చేసిన సందర్భంగా ఆయనకు జీతం లేనందున తన కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువ అవుతున్నందుకు, ప్రతి నెల పింఛన్ ఇవ్వాల్సిందిగా మా బీసీ సంఘాల తరఫున ముఖ్యమంత్రిని కోరుకుంటున్నామనీ అన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘం అధ్యక్షులు రొట్టె శ్రీధర్, కన్వీనర్ అనుపురం చిన్న లింబాద్రిగౌడ్, కార్యవర్గ సభ్యులు, బీసీ సంఘాల నాయకులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.



