ప్రభుత్వ జూనియర్ కళాశాల ను ఆకస్మికంగా సందర్శించిన ఇంటర్ విద్యా జిల్లా అధికారి

viswatelangana.com
ఇంటర్ విద్యా పరిపాలనలో భాగంగా జగిత్యాల జిల్లా డిఐఈఓ డా. వెంకటేశ్వర్లు శనివారం రోజున స్థానిక రాయికల్ ప్రభుత్వ జూనియర్ కళాశాలను ఆకస్మికంగా సందర్శించి, అన్ని బోధనా తరగతులను పరిశీలించి, విద్యార్థినీ విద్యార్థులను బోధనా అభ్యసన సమస్యల గురించి అడిగి తెల్సుకుని, ఆలస్యంగా వస్తున్న పిల్లల్ని మందలించి కారణం తెల్సుకుని అధ్యాపకులకు తగు సూచనలిచ్చారు. అలాగే విద్యార్థులు కళాశాలకు నిత్యం సరైన సమయానికి హాజరై కష్టపడి చదివి సత్ఫలితాలు సాధించాలని సూచించారు. కళాశాల ఇంగ్లీష్ లెక్చరర్ ఎస్. రాజేంద్రప్రసాద్ బహుకరించిన డిజిటల్ మైక్ సౌండ్ సిస్టమ్ నిడి ఐ ఈ ఓ తమ చేతుల మీదుగా ప్రిన్సిపల్ మరియు స్టాఫ్ సమక్షంలో స్విచ్ ఆన్ చేసి ప్రారంభించి డోనర్ ని ప్రశంసించారు. ప్రిన్సిపాల్ మరియు అధ్యాపకులను ఉద్దేశించి కళాశాల అడ్మిషన్లు, అభివృద్ధి, పాఠ్యాంశాల బోధనా అభ్యసన, ప్రాక్టికల్ తరగతుల నిర్వహణ బోధనా మరియు పునశ్చరణ సకాలంలో పూర్తిచేసి పిల్లల్ని వార్షిక పరీక్షలకు సిద్ధం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ మరియు ఉపన్యాసకులు బోధనేతర సిబ్బంది పాల్గొన్నారు.



