బాగా చదువుకుని ఉన్నతంగా ఎదగాలి

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని బాలికల ఉన్నత పాఠశాలలో శుక్రవారం రోజున జాతీయ బాలిక దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఉపాధ్యాయులు పొన్నం రమేష్ మాట్లాడుతూ ఆడపిల్ల పుట్టిన తర్వాత అనేక ఆంక్షలు విధిస్తున్నారు.వాటి నీ నిర్మూలించి ఆడపిల్లలపై ప్రత్యేక దృష్టి సారించే దిశగా భారత ప్రభుత్వం స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జాతీయ బాలిక దినోత్సవం 2008 జనవరి 24న ప్రారంభించడం జరిగింది. సమాజంలో బాలికలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ప్రజలలో అవగాహన పెంచడానికి ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నారని అన్నారు. బాలికల గురించి అసమానత్వం, విద్య పోషణ చట్టపరమైన హక్కులు, బాల్యవివాహాల గురించి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఆడపిల్ల అనగానే సమాజంలో చిన్నచూపు చూస్తున్నారు. అంతేకాకుండా కడుపులో బిడ్డ ఆడపిల్ల అని తెలియగానే భ్రూణహత్యలకు పాల్పడుతున్నారని, తల్లిదండ్రులు తమ పిల్లలపై ప్రేమలో వ్యత్యాసాన్ని చూపకూడదని, విద్యార్థులు బాగా చదువుకొని ఉన్నతంగా ఎదగాలని అన్నారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు రవీందర్,మల్లేశం, గంగజమున, సత్యనారాయణ, అలీ, రాజా, నాగరాజు, తిరుమల, సామల్ల గంగాధర్, వనిత, పారిపెల్లి గంగాధర్, యాస్మిన్, ఫాతిమా, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.



