బాపూజీ, శాస్త్రీజీలకు ఘన నివాళులు అర్పించిన జువ్వాడి కృష్ణారావు

viswatelangana.com
భారత జాతిపిత బాపూజీ, దివంగత మాజీ ప్రధానమంత్రి లాల్ బహుదూర్ శాస్త్రి ల జయంతి ఉత్సవాలను కోరుట్ల పట్టణంలో ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని గాంధీ రోడ్ లో గల మహాత్మా గాంధీ విగ్రహానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీసీనియర్ నాయకులు జువ్వాడి కృష్ణారావు పూలమాలవేసి ఘన నివాళులు అర్పించారు. అంతకు ముందు కోరుట్ల పట్టణంలోని జువ్వాడి కృష్ణారావు స్వగృహం జువ్వాడి భవన్లో జరిగిన కార్యక్రమంలో మహాత్మా గాంధీ లాల్ బహుదూర్ శాస్త్రిలకు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో జువ్వాడి కృష్ణారావుతో పాటు కోరుట్ల మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కొంతం రాజం, బ్లాక్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు పెరుమాండ్ల సత్యనారాయణ, జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ అధ్యక్షుడు వెంకటేష్ గౌడ్, నియోజకవర్గ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు ఏలేటి మహిపాల్ రెడ్డి, కంది బుచ్చిరెడ్డి, కృష్ణ ప్రసాద్, చింత రూపలత, అశోక్, ఖయ్యూం, వసీం, నజ్జు, పోతుగంటి శంకర్ గౌడ్, రిజ్వాన్ పాల్గొన్నారు.



