కథలాపూర్
బీజేపీ గావ్ చలో – బస్తీ చలో కార్యక్రమం

viswatelangana.com
April 10th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
చింతకుంట గ్రామంలో గురువారం రోజున నిర్వహించారు. గ్రామస్తులకు మోదీ సర్కార్ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. కేంద్ర ప్రభుత్వం ద్వార లబ్ది పొందిన లబ్దిదారులను కలిసి వారితో ముచ్చటించారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులను కలిసి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. బీజేపీ కేంద్రంలో మరియు రాష్ట్రంలో ఎదుగుదలను వివరించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరవేయాలని, ఇప్పటినుంచే పక్క ప్రణాళిక సిద్ధం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో బీజేపీ మండల శాఖ అధ్యక్షుడు మల్యాల మారుతి, బూత్ అధ్యక్షులు రాజేష్, కమలాకర్, మహేష్ నాయకులు శివ, వెంకటేష్, విష్షు, శ్రీహరి మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.



