కొడిమ్యాల
భగవత్ రామానుజుల స్వామి వారి 1008 తిరునక్షత్రం సందర్భంగా విశేష పూజలు

viswatelangana.com
May 2nd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల పట్టణంలో గల శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారి ఆలయంలో భగవత్ రామానుజుల స్వామి వారి 1008 తిరునక్షత్రం జన్మదినం సందర్భంగా రామానుజుల విగ్రహానికి పంచామృత అభిషేకం నిర్వహించి పుష్పాలతో అష్టోత్తర నామాలతో పూజించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమాలు ఆలయ అర్చకులు నాగరాజు రమేష్ నిర్వహించడం జరిగింది. ఇట్టి పూజా కార్యక్రమం లో భక్తులు పాల్గొన్నారు.



