కథలాపూర్

భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉంది.-ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్

viswatelangana.com

March 29th, 2025
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.. శనివారం కథలాపూర్ మండల కేంద్రంలో ఏఐసీసీ,పిసిసి పిలుపు మేరకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ అమలు పై మండల స్థాయి సమావేశంలో, రాష్ట్ర సాంసృతికశాఖ ఛైర్మెన్, స్టేట్ కొ ఆర్డినేటర్ వెన్నల, వేములవాడ సిరిసిల్ల నియోజకవర్గ పిసిసి కొ ఆర్డినేటర్ ఏం.డి ఆవేజ్ తో కలసి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత ప్రతీ ఒక్కరి పై ఉందని, స్వతంత్ర స్వేచ్చ ఫలాలను భారత దేశంలోని అందరికీ అందేలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తోందన్నారు.. బ్రిటిష్ పాలకుల చెర నుండి స్వతంత్రం వచ్చిన తర్వాత కాంగ్రెస్ పార్టీ ఆద్వర్యంలో దేశాన్ని అభివృద్ధి పథంలో తీసుకెళ్లడం జరిగిందన్నారు.. బీజేపీ దేశంలో అధికారంలోకి రాగానే ఒక నియంత్రిత పోకడతో పరిపాలన చేస్తోందన్నారు. గతంలో జరగాల్సిన జనాభా లెక్కలను కూడా చెయ్యేకుండా వాయిదా వేసిన ఘనత వారికి దక్కిందన్నారు…. రాహుల్ గాంధీ పాదయాత్ర చేపట్టి దేశంలో ఉన్న వివక్షను రూపంపడం కోసం కృషి చేస్తున్నారని, దేశంలో పేద ప్రజలకు ఉపయోగ పడే ప్రతి పథకాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రారంభం చేసిందని, బీజేపీ గత 10 సంవత్సరాల పాలనలో పేదలకు ఉపయోగ పడే ఒక్క పథకం కూడా అమలు చేయలేదన్నారు. బీజేపీ విధి విధానాలు ఎండ గడుతూ ముందుకు పోవాలన్నారు. డి లిమిటేషన్ పేరుతో దక్షిణాది రాష్ట్రాల పార్లమెంట్ స్థానాలు తగ్గించే కుట్రాచేస్తున్నదని, అవినీతి ఆరోపణలు ఉన్న వారు బీజేపీ లో చేరగానే వాషింగ్ పౌడర్ నిర్మా లాగా మారిపోతున్నారని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాణాలను ప్రజలకు చెప్పేందుకు జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమం ఒక చక్కటి వేదికగా ఉపయోగపడుతుందన్నారు. రైతుల మేలు కోరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే సారి రెండు లక్షల రూపాయలు ఋణ మాఫీ చేయడం జరిగిందన్నారు. దేశంలో ఒకే దఫాలో 20 వేల పై చిలుకు కోట్ల రుణమాఫీ చేయడం ఇప్పటి వరకు లేదన్నారు. ఇప్పటి వరకు 4 ఎకరాల వరకు రైతు భరోసా వెయ్యడం జరిగింది.. రైతుల కోసం ప్రభుత్వం ఇప్పటి వరకు 56 వేల కోట్లు కేటాయించడం జరిగిందని.. రైతులకు నాణ్యమైన విద్యుత్ అందజేయాలని అని కథలాపూర్ మండల కేంద్రంలో 220 సబ్ స్టేషన్ నిర్మాణం ఇతర గ్రామాల్లో నూతన సబ్ స్టేషన్ ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినట్లు పేర్కొన్నారు.గత ప్రభుత్వం రైతులను తాలు తప్ప పేరుతో మోసం చేశారని, మన ప్రాంత ప్రజల చిరకాల కోరిక కళికోట సూరమ్మ చెరువు పనులు శరవేగంగా కొనసాగుతున్నాయని అన్నారు.. ప్రజలకు మనం చేసిన పనులను చెపుతూ ముందుకు పోవాలన్నారు.. రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం ద్వారా పది లక్షల వరకు పెంచడం జరుగుతుంది.. మన ప్రాంతం నుండి ఎక్కువ సంఖ్యలో గల్ఫ్ లో మరణించిన కార్మికులకు 5 లక్షల రూపాయల ఎక్స్ గ్రెసియా ఇస్తున్నాం అన్నారు.. గత ప్రభుత్వం గల్ఫ్ కార్మికులను మోసం చేసిందన్నారు. కామారెడ్డి డిక్లరేషన్ లో ఇచ్చిన మాట ప్రకారం బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించడానికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కుల గణన చేసిందని, తద్వారా విద్య వైద్యం ఉద్యోగ రాజకీయంగా ఎన్నొ అవకాశాలు ఏర్పడతాయన్నారు. గత పది సంవత్సరాలలో బిఆర్ స్ ఒక్క పథకానికి కూడా సరియిన పాలసి తెలేదన్నారు.. 30 సంవత్సరాల ఎస్సీ వర్గీకరణ కూడా అసెంబ్లీలో బిల్లు ఆమోదం పరుచుకోవడం జరిగిందని, రాష్ట్రంలోని రెండు చారిత్రాత్మక బిల్లులు ఆమోదం పొందడంలో భాగస్వామ్యం కావడం సంతోషం అన్నారు.. యువత కు స్వయం ఉపాధి కోసం రాజీవ్ యువ వికాసం ప్రారంభం చేసుకోవడం జరిగిందని, నిరుద్యోగుల అభ్యున్నతికి రాజీవ్ యువ వికాసం ఎంతో ఉపయోగపడుతుందన్నారు…

Related Articles

Back to top button