కథలాపూర్

మల్లికార్జున స్వామి కళ్యాణ మహోత్సవంలో ఆది

viswatelangana.com

January 28th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :

కథలాపూర్ మండలం తాండ్ర్యాలలోని మల్లికార్జున స్వామిని ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆ స్వామివారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని వేడుకున్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గంగా ప్రసాద్,కాంగ్రెస్ మండల అధ్యక్షుడు కాయితి నాగరాజు, పులి హరిప్రసాద్, శ్రీనివాస్, చారి తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button