యం.ఈ.వో శ్రీపతి రాఘవులుకు ఘన సన్మానం భగవద్గీత ప్రదానం చేసిన ఆర్.యు.పి.పి.టి జగిత్యాల జిల్లా శాఖ…

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండల విద్యాశాఖాధికారిగా నియమితులైన మండల్ నోడల్ అధికారి శ్రీపతి రాఘవులు నియామకం కావడంతో రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు జగిత్యాల జిల్లా శాఖ పక్షాన జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి వేల్పుల స్వామి యాదవ్ శాలువాతో ఘనంగా సన్మానించి భగవద్గీత ప్రదానం చేసి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కార్యదక్షత, అకుంఠిత దీక్ష కలిగి ఎందరో విద్యార్థులను ఉత్తములుగా తయారు చేసారని, విద్యారంగంలో ఎనలేని సేవలు చేసారని, చేస్తున్నారని అన్నారు. భవిష్యత్తు లో మరిన్ని ఉన్నత పదవులు, ఉన్నత శిఖరాలు అధిరోహించాలని అన్నారు . ఈ కార్యక్రమంలో కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు కాపు శ్రీనివాస్, పి.ఆర్.టి.యు రాష్ట్ర శాఖ ఉపాధ్యక్షులు పొన్నం రమేష్ గౌడ్, టి.పి.యు.ఎస్. జిల్లా ఉపాధ్యక్షులు చెరుకు మహేశ్వర శర్మలకు, జొంగోని రాజేశం, పారిపెల్లి గంగాధర్, రవీందర్, మల్లేశం, సత్యనారాయణ, శివానందం, గంగాధర్, పద్మజా, అలీరాజా, లోకిని జమున, తిరుమల, వనిత, ఫాతిమా తదితరులు పాల్గొన్నారు.



