కొడిమ్యాల
యువకుడి ఆత్మహత్య

viswatelangana.com
February 3rd, 2025
కొడిమ్యాల (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ఇందిరానగర్ కాలనీలో సోమవారం రోజున చిర్ర సంతోష్ తండ్రి చంద్రయ్య వయస్సు దాదాపు 20 సంవత్సరాలు అనే యువకుడు ఉదయం దాదాపు 9 గంటల ప్రాంతంలో అతని సొంత ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్సై సందీప్ ఘటన స్థలానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు.సంతోష్ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది.



