కథలాపూర్
రాళ్ళవాగు కుడికాలువ ను పరిశీలించిన అధికారులు, నాయకులు

viswatelangana.com
February 28th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం భూషణరావు పేట శివారులో గల రాళ్లవాగు కుడికాలువకు గండిపడిన స్థలాన్ని నీటిపారుదలశాఖ కరీంనగర్ ఎస్ఈు శివశంకర్, ఈఈ అమరేందర్రెడ్డి మంగళవారం పరిశీలించారు. వర్తకాలంలో కుడికాలువకు గండిపడీ భూష ణరావుపేట శివారులోని భూములకు నీరంద డంలేదని రైతులు ఎమ్మెల్యే,ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ కు విన్నవించారు. ఆయన సూచనల మేరకు అధికారులు గండితోపాటు చేయాల్సిన మరమ్మతును పరిశీలించారు. ప్రాజెక్టు నిజామాబాద్ జిల్లా పరిధిలో ఉండటంతో అక్కడి అధికారులతో సమావేశమైతే సమస్య పరిష్కారం అవుతుందని అధికారులు. తెలిపారు. కాలువకు త్వరగా మరమ్మతు చేయాలని రైతులు అధికారులను కోరారు.ఈ కార్యక్రమం లో డీఈ ప్రశాంత్, కమ్మర్పల్లి ఏఈ శేఖర్, నాయ కులు వాకిటి రాజారెడ్డి, గడ్డం చిన్నారెడ్డి. స్వామిరెడ్డి,గోపిడి మధు, వెంకట్ రెడ్డి, రాజశేఖర్, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.



