రాయికల్
రెమ్యూనరేషన్ ఇవ్వాలి

viswatelangana.com
February 3rd, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో సమగ్ర కుటుంబ సర్వే నిర్వహించిన ఉపాధ్యాయులకు రెమ్యూనరేషన్ వెంటనే ఇవ్వాలని ఎంపిడివో కు పిఆర్టియు టిఎస్ మండల శాఖ ఆధ్వర్యంలోసోమవారం వినతి పత్రం సమర్పించారు. విధుల్లో పాల్గొన్న సిబ్బందికి డ్యూటీ సర్టిఫికెట్లు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు పొన్నం రమేష్, కుంబాల శ్రీనివాస్, గాజంగి రాజేశం, జిల్లా కార్యదర్శి దొంతి సతీష్, కడకుంట్ల అభయ్ రాజ్, సిలివేరి రమేష్,మాచర్ల మహేష్, ఊసకోల రాము, బెజ్జంకి హరికృష్ణ, ద్యావనపల్లి సురేష్, తాటిపాముల రమేష్ లు పాల్గొన్నారు.



