రేపు కొండగట్టుకు పవన్ కళ్యాణ్

viswatelangana.com
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రం కొండగట్టుకు వెళ్లనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇలవేల్పుగా భావించే పవన్.. ఎన్నికల్లో విజయం సాధించడంతో ఇక్కడ మొక్కులు చెల్లించుకోనున్నారు. గతంలో వారాహి యాత్రకు ముందు ఆ వాహనానికి ఇక్కడే పూజలు చేయించారు. రేపు ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయల్దేరి రోడ్డు మార్గంలో కొండగట్టుకు వెళ్తారు. తిరిగి రోడ్డు మార్గంలో సాయంత్రం 4.30 గంలకు హైదరాబాద్ నివాసానికి వెళ్తారు. జనసేన అధినేతకు భారీ స్వాగత ఏర్పాట్లు చేసింది తెలంగాణ జనసేన విభాగం. కొండగట్టు అంజన్న ఆశీస్సులతో తమకు మంచి జరిగిందని పవన్ కల్యాణ్ మరోసారి శనివారం కొండగట్టు పర్యటనకు వస్తున్నట్లు జనసేన పార్టీ శ్రేణులు వెల్లడించారు. ఏపీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి అఖండ విజయం సాధించింది. కూటమి విజయంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రధాన పాత్ర పోషించారు



