మేడిపల్లి

రైతులకు ఇబ్బందులు కలిగించవద్దు

viswatelangana.com

May 20th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలలో రైతులకు ఇబ్బంది కలగకుండా చూడాలని సిబ్బందిని కోరుట్ల ఆర్డిఓ ఆనంద్ కుమార్ ఆదేశించారు. మేడిపల్లి మండలంలోనీ మేడిపల్లి,కట్లకుంట,పోరుమళ్ళ గ్రామాలలో వరి కొనుగోలు కేంద్రాలను పరిశీలించారు, ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కొందరు సిబ్బంది రైతుల పట్ల దురుసుగా, అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని రైతులు వాపోతున్న విషయాన్ని ప్రస్తావించారు, రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదని సిబ్బందికి హెచ్చరించారు. అలాగే కేంద్రాలలో రెండువేల పైచిలుకు తూకం వేసిన బస్తాలు ఎందుకు తరలించడం లేదని సిబ్బందిని గట్టిగా మందలించారు,, సెంటర్లో తాగు నీటి వసతి ఎందుకు ఏర్పాటు చేయలేదన్నారు, ఫోన్ ద్వారా సివిల్ సప్లై డిఎం తో మాట్లాడి ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆదేశించారు, ఆర్డిఓ వెంట సిబ్బంది పాల్గొన్నారు.

Related Articles

Back to top button