మేడిపల్లి
రైస్ మిల్ నందు మంటలు అంటుకుని భారీ నష్టం
viswatelangana.com
April 14th, 2024
మేడిపల్లి (విశ్వతెలంగాణ) :
ఆదివారం ఉదయం తెల్లవారు జామున దేసాయిపేట గ్రామ శివారులో గల విఘ్నేశ్వర పారాబాయిల్ రైస్ మిల్ నందు మంటలు అంటుకొని సుమారు 22 వేల క్వింటాళ్ల వడ్ల సంచులు, 20వేల ఖాళీ గన్ని సంచులు కాలి బూడిద అయ్యాయి. ఇట్టి సంఘటనలో విగ్నేశ్వర రైస్ మిల్ యాజమాన్యం కు దాదాపు మూడు కోట్ల 30 లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని ఫిర్యాదిదారుడు సింగిరెడ్డి జనార్దన్ రెడ్డి ఫిర్యాదు మేరకు ఎస్సై జి. శ్యామ్ రాజ్ కేసు నమోదు చేసుకోవడం జరిగింది.




