రాయికల్
రోడ్డు ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబానికి చేయూత

viswatelangana.com
May 26th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం కొత్తపేట గ్రామానికి చెందిన మ్యాడారపు అనిల్ కుమార్(22) అనే యువకుడు కడెం వెళ్లి వస్తుండగా ప్రమాదానికి గురి అయ్యి ప్రాణాలు కోల్పోయాడుమృత్తునికి భార్య 7 నెలల కూతురు ఉన్నారు విషయం తెలుసుకున్న రాయికల్ కు చెందిన ఇన్నోవేటర్స్ వెల్పేర్ సొసైటీ గ్రూప్ సభ్యులు చలించి మృతుని కుటుంబానికి 10,000/- రూపాయలు ఆర్థిక సహాయం అందించారు వారు మాట్లాడుతూ ఇది చాలా బాధాకరం అని వాహనాలు నడిపే వారు జాగ్రత్తగా నడపాలని హెల్మెట్ ధరించాలని మద్యం సేవించి వాహనాలు నడుపకూడదు అని అన్నారు దాతలు ఎవరైనా స్పందించి ఆ కుటుంబాన్ని ఆదుకోవాలని మా గ్రూప్ తరుపున ముందు ముందు ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేపడతామని తెలిపారు ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు కాశిరెడ్డి మారుతీ మహర్షి రాజేష్ అవినాష్ రఘువంశీ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు



