కథలాపూర్
వాలీబాల్ క్రీడాకారులకు అభినందన వెల్లువ వెల్లువ

viswatelangana.com
January 18th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా మల్యాల లో 16 మరియు 17 వ తేదీలలో జరిగినటు వంటి కెసిఆర్ కప్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి టోర్నమెంట్ లో ఊటుపల్లి వాలీబాల్ టీం ద్వితీయ బహుమతి సాధించింది.ఈ సందర్భంగా క్రీడాకారులు మాట్లాడుతూ ప్రోత్సాహం అందిస్తే ఇంకా ఎన్నో విజయాలు సాధిస్తామని హర్షం వ్యక్తం చేశారు.వీరికి ఊటుపల్లి సర్పంచ్ గజ్జెల స్వామి ఉప సర్పంచ్ ఏజిబి గణేష్ లు అభినందనలు తెలిపారు.ఈ కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.



