రాయికల్

విద్యార్థులే ఉపాధ్యాయులైన వేళ

viswatelangana.com

September 5th, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల ప్రభుత్వ మోడల్ స్కూల్ అలాగే జూనియర్ కళాశాలలో ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ బి.మోహన్ అలాగే ఉపాధ్యాయులు, చిన్నారి ఉపాధ్యాయులతో కలిసి సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాల వేసారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఉపాధ్యాయుల వేషధారణలతో ఉపాధ్యాయుల వలె తరగతులను నిర్వహించారు. ఒకరోజు ఉపాధ్యాయులుగా తమను భావించుకోవడం ఒక ప్రత్యేక భావనను కలిగించిందని, ఈ సందర్భంగా విద్యార్థులు తమ మనోభావాలను ఆవిష్కరించారు. తదనంతరం విద్యార్థులు ఉపాధ్యాయులను శాలువాతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ బి. మోహన్ మాట్లాడుతూ… విద్యార్థులు గొప్పవారి జీవితాలను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నతంగా ఎదగాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button