రాయికల్

సైనిక సంక్షేమ నిధికి విరాళం

viswatelangana.com

July 4th, 2025
రాయికల్ (విశ్వతెలంగాణ) :

జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలోని రామాజీపేట గ్రామానికి చెందిన దుబాయ్ వారధి సంఘం సభ్యులు సైనిక సంక్షేమ నిధికి రూ. 20,000 విరాళంగా అందజేశారు. రామాజీపేట గ్రామానికి చెందిన పలువురు యువకులు ఉపాధి నిమిత్తం దుబాయ్ దేశానికి వెళ్లి కూలి పనులు చేస్తూ ఒక పక్క కుటుంబానికి చేయూతనందిస్తూ సామాజిక సేవకు తమ వంతు కృషి చేస్తున్నారు. దీనిలో భాగంగానే ఇటీవల గ్రామానికి చెందిన పలువురు పేద కుటుంబాలకు ఆర్థిక చేతను అందజేశారు. శుక్రవారం వారధి సంఘ సభ్యులు కలిసి సైనిక సంక్షేమ నిధికి రూ. 20,000 జమ చేసి వాటి డిడిని రాయికల్ తహసిల్దార్ నాగార్జున కు అందజేశారు.ఈ కార్యక్రమంలో సంఘసభ్యులు, మాజీ సర్పంచ్ దశమంద వెంకటేశ్వర్లు,మాజీ ఉపసర్పంచ్ ఆర్మూరీ నరేందర్, ఆకుల సత్యం,పల్లికొండ రాజేందర్, పల్లికొండ రాజేష్, రాజు,కనికరపు రాజేష్, గ్రామ నాయకులు కోల రాజు, ఏనుగంటి రాజు తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button