viswatelangana.com
ఎన్నికలకు ముందు రైతులకు ఇచ్చిన హామీల అమలు కోరుతూ అక్టోబర్ 4 చలో కలెక్టరేట్, రైతు ధర్నా ను విజయవంతం చెయ్యాలని జగిత్యాల జిల్లా రైతు ఐక్యవేదిక ఆధ్వర్యంలో పిలుపునిచ్చారు.. జగిత్యాల జిల్లా కేంద్రంలో పాత్రికేయల సమావేశంలో రైతు ఐక్యవేదిక రాష్ట్ర నాయకులు పన్నాల తిరుపతిరెడ్డి మాట్లాడుతూ ఎన్నికలకు ముందు రాష్ట్ర ప్రభుత్వం రెండు లక్షల వరకు రుణమాఫీ చేస్తామని హామీ ఇచ్చి గద్దెనెక్కాక హామీల అమలు మర్చిపోయారని.. రుణమాఫీకి రైతులకు షరతులు విధిస్తూ రైతుల్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాష్ట్ర వ్యాప్తంగా ఇంకా రుణమాఫీ కానీ రైతులు లక్షల మంది ఉన్న.. ప్రభుత్వం గందరగోళం సృష్టిస్తున్న నేపథ్యంలో చలో జగిత్యాల కలెక్టరేట్ కార్యకమానికి జిల్లా రైతాంగం స్వచ్ఛందంగా తరలిరావాలని పిలుపునిచ్చారు.. అలాగే వరి ధాన్యానికి క్వింటాల్ కి 500 బోనస్ ఇస్తానని ఇప్పుడు మాట తప్పి కేవలం సన్న వడ్లకే ఇస్తానని అనడం సరికాదని, సన్న వడ్ల కు మద్దతు ధర కన్నా మార్కెట్లో అదనంగా ఉందని.. ప్రభుత్వం సన్న వడ్ల కు బోనస్ ఇస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.. ఈ సందర్బంగా రైతు ఐక్య వేదిక జిల్లా అధ్యక్షులు నల్ల రమేష్ రెడ్డి మాట్లాడుతూ రైతు భరోసా ఎకరాకి సంవత్సరానికి 15000 అందజేస్తామని చెప్పి.. ప్రభుత్వం ఏర్పడి తొమ్మిది నెలలు గడుస్తున్నా ఇంకా కాలయాపన చేస్తున్నారని.. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలనే పూర్తి స్థాయిలో అమలు చెయ్యాలని అన్నదాతలు కోరుతున్నారని, అన్నదాతలు అదనంగా గొంతెమ్మ కోరికలు ఏమి కోరడం లేదని,ఎన్నికల సందర్బంగా ఇచ్చిన హామీలను అమలుచేయడం లో విఫలమైన నేపథ్యంలో ప్రభుత్వం కు రైతుల గోడు వినిపించడానికి చేస్తున్న చలో కలెక్టరేట్ రైతు ధర్నా కు పార్టీలకి అతీతంగా రైతులు పెద్ద ఎత్తున తరలిరావాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా రైతులు స్వచ్ఛందంగా మద్దతు తెలుపుతున్నారని, ధర్నాకి ప్రతి గ్రామం నుండి రైతులు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతు ఐక్యవేదిక నాయకులు వేముల కర్ణాకర్ రెడ్డి, గడ్డం రాజారెడ్డి, బద్దం మహేందర్ రెడ్డి, బందెల మల్లన్న, సోమిరెడ్డి బుచ్చిరెడ్డి, బోదాసు మల్లేష్, గడ్డం రాంరెడ్డి, గడ్డం విజయ్ కుమార్, పలువురు రైతు ఐక్యవేదిక నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.



