ఇంటర్ విద్యకు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి

viswatelangana.com
జగిత్యాల జిల్లా కొడిమ్యాల మండల కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల అధ్యాపకులు ఇంటర్మీడియట్ బోర్డ్ కార్యదర్శి ఆదేశాల మేరకు గురువారం రోజున ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చేరండి అంటూ ప్రచారం మండల కేంద్రంలో ఇండో ఇంగ్లిష్ మీడియం ఉన్నత పాఠశాలలో ప్రారంభించారు. పదవ తరగతి పాస్ అయిన తర్వాత విద్యార్థులు ఇంటర్మీడియట్ విద్య కోసం ప్రభుత్వ కళాశాలలో చేరాలని విద్యార్థులను కోరారు.ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ ప్రభుత్వ కళాశాలల్లో నాణ్యమైన విద్య బోధనకై ప్రభుత్వం అన్ని రకాల సౌకర్యాలను కల్పిస్తుందని, విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కావున విద్యార్థులు ప్రభుత్వ కళాశాలలో ప్రవేశం పొంది, తమ బంగారు భవితకు పునాదులు వేసుకోవాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు ఎం.అనిల్ కుమార్,డా.పి. తిరుపతి, కె.శ్యామ్ కుమార్, వి.అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.



