జగిత్యాల

జిల్లా పోలీస్ కార్యాలయంలో ఆత్మీయ వీడ్కోలు

viswatelangana.com

May 3rd, 2025
జగిత్యాల (విశ్వతెలంగాణ) :

పోలీస్ శాఖలో హోంగార్డ్ గా గత 34 సంవత్సరాలుగా విధులు నిర్వహించి పదవి విరమణ పొందుతున్న రామచంద్రం ను జిల్లా పోలీస్ కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ భీమ్ రావు పూలమాల వేసి శాలువలతో ఘనంగా సన్మానించారు. పోలీస్ ఉద్యోగ నిర్వహణలో అంకిత భావంతో పనిచేసి అందరి మన్ననలను పొందినారు అన్నారు. సుదీర్ఘకాలంగా విధులు నిర్వహించి పదవీవిరమణ చేసిన సేవను మరువమని, పదవీవిరమణ చేసిన కుటుంబంలో ఎలాంటి సమస్య వచ్చిన తనను సంప్రదించ వచ్చని పోలీసు రిటైర్ మెంట్ కేవలం తన వృత్తికే, కాని తన వ్యక్తిత్వానికి కాదు అని కొనియాడారు.ఈ కార్యక్రమంలో ఆర్.ఐ వేణు పాల్గొన్నారు.

Related Articles

Back to top button