రాయికల్
ప్రజలు జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలి డాక్టర్ శ్రీనివాస్

viswatelangana.com
September 21st, 2024
రాయికల్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా రాయికల్ మండలంలో ప్రజలు జ్వరాలపై అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఉపవైద్యాధికారి డాక్టర్ ఎన్ శ్రీనివాస్ అన్నారు అల్లిపూర్ లో గల పల్లె దవాఖానను పరిశీలించి రికార్డులు మందులు తనిఖీ చేశారు రాయికల్ పట్టణంలోని ఇందిరానగర్ బుడగ జంగాల కాలనీ లో జ్వరాల నియంత్రణ చర్యలపై సిబ్బందితో కలిసి అవగాహన కల్పించారు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని సూచించారు జ్వరం లక్షణాలు ఉంటే వెంటనే ప్రభుత్వ ఆసుపత్రిలో రక్త పరీక్షలు చేయించుకోవాలని అన్నారు రాయికల్ జగిత్యాల ఆసుపత్రిలో జ్వరాలకు ప్రత్యేక పడకలు ఏర్పాటు చేశామన్నారు ఆరోగ్య సిబ్బంది అందుబాటులో ఉండి సూచనలు ఇస్తారని సూచించారు ఈ కార్యక్రమంలో హెచ్ఈ సత్యనారాయణ హెచ్ఈవో సాగర్ రావు సూపర్వైజర్లు శ్రీనివాస్ ఇల్లెందుల శ్రీనివాస్ హెల్త్ అసిస్టెంట్ కడకుంట్ల భూమయ్య తదితరులు పాల్గొన్నారు



