కోరుట్ల
ఫీజుల పట్టిక ప్రైవేట్ ఆసుపత్రుల్లో అమర్చాలి

viswatelangana.com
August 22nd, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల ప్రైవేట్ హాస్పిటల్ లను జిల్లా ఉప వైద్యాధికారి డాక్టర్ నీలారపు శ్రీనివాస్ ఆకస్మిక తనికీ చేసారు. పట్టణంలోని విజయ హాస్పిటల్ పరిశీలించారు. జ్వరాలు విజృబించడం జనాలు అనారోగ్యాల పాలవడం జరుగుతుండటంతో, ప్రైవేట్ హాస్పిటల్ లు కిక్కిరిసి పోతున్నాయి విష జ్వరాలు ప్రబలి ఆసుపత్రుల చేరడంతో అధిక బిల్లులతో ప్రజల జేబులు చిల్లులు చేస్తున్నారని, ఫీజుల నియంత్రణ జరపాలని ఆయన సూచించారు. వ్యాధులకు వాటి చికిత్సకు సంబందించిన ఫిజుల పట్టిక తప్పకుండా అమర్చాలని శ్రీనివాస్ తెలిపారు. ఫీజుల పట్టిక అమర్చకుంటే తగిన చర్యలు ఉంటాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైద్య సత్యనారాయణ సిబ్బంది పాల్గొన్నారు.



