కోరుట్ల

మాదిగ అమరవీరులకు జోహార్లు

ఎంఆర్పిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి అంజయ్య

viswatelangana.com

March 2nd, 2025
కోరుట్ల (విశ్వతెలంగాణ) :

మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో గత 30 సంవత్సరాల నుండి అలుపు ఏరుగని పోరాటం చేస్తున్నటువంటి సందర్భంలో అసువులు బాసిన మాదిగ బిడ్డలు పొన్నాల సురేందర్ మాదిగ, సిర్రా నాగేశ్వరరావు, మీరా సాహెబ్ మాదిగ, నడిమిండ్ల దామోదర్ మాదిగ, ములుగు మహేష్ మాదిగ, దర్శనల భారతి మాదిగ, పెద్దాడ ప్రకాష్ రావు మాదిగ, గింజరపు ప్రభాకర్ మాదిగ, సోదరులు తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా ఉద్యమానికి సమితులుగా వారి ప్రాణ త్యాగంతోనే నేడు ఈ యొక్క వర్గీకరణ అంశం తుది దశకు చేరుతుందని అలాంటి మహాయోధులకు నివాళులర్పించడం మన మాదిగ సోదరుల కనీస ధర్మం అని తెలంగాణ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన తడుపుల అంజయ్య తెలిపారు. కల్లూరు గ్రామంలో అంబేద్కర్ చావడి దగ్గర అమరవీరులకు ఘనంగా నివాళులర్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అజయ్, మహాతేజ, గంగాధర్, మోహన్, శేఖర్, వజిత్, జబ్బర్, సత్తన్న, రాజేష్, వన్నెల గణేష్ తదితరులు పాల్గొన్నారు.

Related Articles

Back to top button