కథలాపూర్
పంట పొలాలను పరిశీలించిన మండల వ్యవసాయ అధికారిణి యోగిత

viswatelangana.com
May 23rd, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల వవసాయ అధికారిణి శ్రీమతి యోగిత క్షేత్ర ప్రదర్శనలో భాగంగా గురువారం రోజున వివిధ వరి పొలాలు తగల బెట్టడం మనించారు .రైతులు ఈ విధంగా వరి కొయ్యలు తగల బెట్టడం వలన భూమి యొక్క సారం తగ్గి, పంట దిగుబడి తగ్గడానికి దోహదం చేస్తుంది. అలాగే కొన్ని చోట్ల ఉపయోగకరమైన సూక్ష్మజీవులు చనిపోయి పంటల ఉత్పత్తి, భూమి యొక్క ఉత్పాదక శక్తి తగ్గిపోతుంది.వరి కొయ్యలు తగల బెట్టడం వలన వాయు కాలుష్యం కూడ పెరుగుతుంది. దీనికి గాను రైతు సోదరులు వరి కొయ్యలు భూమిలో కరిగేట్లు ఎస్ఎస్ పి ని వాడాలని మండల వ్యవసాయ అధికారిణి యోగిత తెలియజేశారు.



