పోషణ అభియాన్

viswatelangana.com
జగిత్యాల జిల్లా రాయికల్ మండలం ఇటిక్యాల గ్రామం లోని గుడేటీ రెడ్డి ఫంక్షన్ హాల్ లో ఇటిక్యాల సెక్టర్ అంగన్ వాడి కేంద్రాల ఆధ్వర్యంలో గురువారం రోజున సెప్టెంబర్ మాసంలో నిర్వహించే పోషణ అభియాన్ ను ఎంపీడీవో బింగి చిరంజీవి, సిడిపిఓ మమత, ఏపీఎం చక్రవర్తి శ్రీనివాస్ గౌడ్ లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, పోషణ ప్రతిజ్ఞ చేయించారు. అనంతరం గర్భిణులకు శ్రీమంతం, పిల్లలకు అన్నప్రాస నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వ్యక్తిగత పరిశుభ్రత, మరియు పరిసరాల పరిశుభ్రత గురించి వివరిస్తూ, పోషకాహారం గురించి చిరుధాన్యాలు ఆకుకూరలు పాలు పండ్లు మిల్లెట్స్ గూర్చి వాటి యొక్క ప్రాముఖ్యత, పోషక విలువల గూర్చి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ సామాల్ల లావణ్య వేణు, నాయకులు ఆదిరెడ్డి, ఐసిడిఎస్ సూపర్వైజర్ పద్మావతి, హెల్త్ సూపర్వైజర్ ఉమా, మహిళా సంఘం సిసి గంగామణి, చైల్డ్ వెల్ఫేర్ ఆర్గనైజర్స్, సఖి కేంద్రం, కార్యదర్శి రాజేష్ కుమార్, ఏఎన్ఎం భాగ్యలక్ష్మి, మహిళా సంఘాల వివోఏ లు, కారోబార్ కిషోర్, గర్భిణీ స్త్రీలు, చంటి పిల్లల తల్లులు, కిషోర్ బాలికలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు.



