కథలాపూర్
కులగణన బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరం

viswatelangana.com
February 16th, 2024
కథలాపూర్ (విశ్వతెలంగాణ) :
జగిత్యాల జిల్లా కథలాపూర్ మండల కేంద్రంలో మున్నూరు కాపు సంఘం మండల అధ్యక్షుడు చెదలు సత్యనారాయణ మాట్లాడుతూ అసెంబ్లీలో శుక్రవారం కులగణన బిల్లు ప్రవేశపెట్టడం సంతోషకరమని, దీనికోసం కృషి చేసిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ కు కృతజ్ఞతలు తెలియజేశారు. రాష్ట్రంలో ప్రజా పాలన కొనసాగుతుందనడానికి నిదర్శనం ఈ బిల్లు ప్రవేశ పెట్టడమని ఆయన అన్నారు.



