కోరుట్ల
సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను వినియోగిస్తున్న వారికీ జరిమానా

viswatelangana.com
September 5th, 2024
కోరుట్ల (విశ్వతెలంగాణ) :
కోరుట్ల పట్టణ మున్సిపల్ కమిషనర్ బట్టు తిరుపతి ఆదేశాల మేరకు పట్టణంలోని ప్లాస్టిక్ ఏజెన్సీలు, కిరాణా షాపులు, హోటల్స్ అలాగే బేకరీలలో తనిఖీలు నిర్వహించి, వారు వినియోగిస్తున్న సింగిల్ యూస్ ప్లాస్టిక్ ను స్వాధీన పరుచుకొని 5 వేల 5 వందల రూపాయలు జరిమానాలు విధించడంతో పాటు పరిశుభ్రతను తనిఖీ చేసారు. అదేవిధంగా బట్ట సంచుల వాడకంపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సానిటరీ ఇన్స్పెక్టర్ బాలే అశోక్, జూనియర్ అసిస్టెంట్ ఆకు అంజయ్య, ప్రసాద్, రమేష్ ,రాజు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.



